వైసీపీ పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు నారా లోకేష్ వేదికగా స్పందించారు. “మహిళలపై మీ ప్రతాపమా YS Jagan Mohan Reddy గారు అని ఒక చెల్లెమ్మ ప్రశ్నిస్తోంది,ఏం సమాధానం చెబుతారు జగన్ రెడ్డి గారు?ఆలీబాబా 40 దొంగల తరహాలో మీరు,మీ ఎమ్మెల్యేలు ప్రజల పై పడి దోచుకుంటున్నారు. మీ రౌడి పాలన కారణంగా కర్నూలు జిల్లాలో శ్రీ లక్ష్మీదేవి గారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు ఓబులరెడ్డి భూకబ్జాకి పాల్పడ్డారు. నంద్యాలలో ఉన్న భూమిని బలవంతంగా లాక్కోవడానికి శ్రీ లక్ష్మీదేవి గారిని బెదిరించి ఏడాదిగా హింసిస్తున్నారు. మహిళల్ని వేధిస్తున్న వైకాపా ఎమ్మెల్యేల పై కఠిన చర్యలు తీసుకోవాలి.” అని డిమాండ్ చేశారు. అంతకుముందు ట్వీట్ లో “పల్నాడులో 100 ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. గుంటూరులో పునరావాస సంక్షేమ పథకాలను నిలిపేసి మైనారిటీలను మోసం చేసి, దాడులు, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురి చేయటమేనా, మీ గొప్ప పాలన ? ” అంటూ ఫైర్ అయ్యారు.