దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.
హైదరాబాద్ నుంచి 110, బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 సర్వీసులను నడుపుతామని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.