telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు

పీవీ సింధుకు ఏపీ నగదు బహుమానం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధుకు ఏపీ నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేసారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందన్న సీఎం… ఈ విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సహిస్తుందన్నారు జగన్‌.

పీవీ సింధుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ నిర్వహణకోసం కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లేముందు సింధుతోపాటు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం చేసిన ప్రభుత్వం… 2017–22 స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.

Related posts