telugu navyamedia
సినిమా వార్తలు

కైకాల సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి త్వ‌ర‌గా వ‌స్తారు – చిరంజీవి

తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్​లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య ప‌రిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్నకైకాల స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో పలకరించినట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలకుంటారన్న పూర్తి నమ్మకం కలిగిందని వెల్లడించారు.

ట్రాకియాస్టోమి కారణంగా కైకాల మాట్లాడలేకపోయినా.. త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి” అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంప్స్ సైన్ చూపించారని చిరు పేర్కొన్నారు.ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నానని.. ఈ విషయం అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మెగాస్టార్‌ ట్వీట్ చేశారు.

కాగా.. చిరంజీవికి కైకాలతో మంచి అనుబంధం ఉంది. చిరు కథానాయకుడిగా నటించిన చాలా సినిమాల్లో సత్యనారాయణ విల‌న్‌గా, స‌హ‌జ న‌టుడిగా కీలక పాత్రలు పోషించారు. ‘యముడికి మొగుడు’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘బావగారూ బాగున్నారా’ వంటి సినిమాల్లో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ట్వీట్. | Kaikala Satyanarayana

ఇటీవలే కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరు త‌న‌ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. 

Related posts