telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురం”.. బన్నీ అభిమానులకు ట్రీట్… !

AY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది. ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై మంచి ఆదరణకు నోచుకుంది. దసరా పండగ సందర్భంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో మాసీ లుక్‌లో కనిపిస్తున్న తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల అయిన ‘సామజవరగమన’ పాటకు విడుదలైన వారంలోనే 20 మిలియన్ వ్యూస్, 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా కానుకగా విడుదల చేసిన ఈ ప్రచార చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Related posts