telugu navyamedia
క్రైమ్ వార్తలు

మణిపూర్‌లో విషాదం: ఆర్మీ బేస్ క్యాంప్‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిపడి ఏడుగురు మృతి..45 మంది జవాన్లు గల్లంతు

మ‌ణిపూర్ లో ఘోర‌ప్ర‌మాదం చోటుచేసుకుంది,నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు.  ప‌లువురు జ‌వాన్ల‌కు గాయాలు అయ్యాయి. వారంద‌రినీ హాస్పిట‌ల్ కు చికిత్స కోసం త‌ర‌లించారు.

జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకుకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం మణిపూర్‌లోని నోనీ జిల్లాలోని టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కంపెనీ మోహరించారు. అయితే ఈ క్యాంపుపై బుధ‌వారం రాత్రి ఒక్క సారిగా భారీ కొండ‌చ‌రియ‌లు ప‌డ్డాయి.

Noney Manipur landslide

ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది ఆచూకీ గల్లంతైంది .మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది.  ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం స్థానిక అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Noney Manipur landslide

ఈ ఘటనపై మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొండచరియలు విరిగిపడిన పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు  సీఎం ఎన్ బీరెన్ సింగ్  తెలిపారు.

 ఇప్పటికే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.ఆపరేషన్‌లో సహాయం చేయడానికి వైద్యులతో పాటు అంబులెన్స్‌లు కూడా పంపించామ‌ని అని ఆయన ట్వీట్ చేశారు.

 

Related posts