telugu navyamedia
రాజకీయ

శివ‌సేన అధికారం కోసం పుట్ట‌లేద‌ని, అధికార‌మే శివ‌సేన కోసం పుట్టింది..

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ విధేయులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శివ‌సేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ రెబ‌ల్ ఎమ్మెల్యేల‌తో పాటు బీజేపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

శివ‌సేన అధికారం కోసం పుట్ట‌లేద‌ని, అధికార‌మే శివ‌సేన కోసం పుట్టింది. ఇది బాలాసాహెబ్ ఠాక్రే ఎల్ల‌ప్పుడూ చెప్పే నినాదం అని శివ‌నేన నాయ‌కుడు, పార్లమెంట్ స‌భ్యులు సంజ‌య్ రౌత్ అన్నారు

ఉద్ద‌వ్ థాక్రే ముఖ్య‌మంత్రి ప‌ద‌విరాజీనామా చేయ‌డంతో తామంతా భావోద్వేగానికి గుర‌య్యామ‌ని సంజ‌య్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధ‌వ్ పై అంద‌రికీ న‌మ్మ‌కం ఉంది. అన్ని కులాలు, మ‌తాల వారు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌న్నారు. సోనియాగాంధీ, శ‌ర‌ద్‌ప‌వార్‌ల‌కు కూడా ఉద్ధ‌వ్‌పై న‌మ్మ‌కం ఉంద‌ని శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్ పేర్కొన్నారు. తాము ఇక్క‌డితో పోరాటాన్ని ఆప‌మ‌ని..ప్ర‌జ‌ల్లోకి వెళ్లి మ‌రింత ప‌నిచేసే మ‌రోసారి సొంతంగా అధికారంలోకి వ‌స్తామ‌ని సంజ‌య్ రౌత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

సుప్రీంకోర్టు నుంచి తీర్పు వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో కొన‌సాగ‌డం కాద‌న్నార‌ని..వెంట‌నే ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేశార‌ని తెలిపారు. నైతిక విలువ‌లున్న నాయ‌కుడు ఆయ‌నేనంటే సంజ‌య్ వ్యాఖ్యానించారు. వారంతా శివసేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారంటూ ఈ మేరకు గురువారం ట్విటర్‌లో ఈ షేర్ చేశారు. ఇప్ప‌డు రాష్ర్టంలో స‌రిగ్గా ఇదే జ‌రిగింది అంటూ  క్యాప్షన్ ఇచ్చారు.

ప్రతీకాత్మక స్కెచ్‌లో తెల్లటి కుర్తా ధరించిన ఉద్ధవ్ థాక్రే వెనుదిరిగి ఉన్నారు. చేతులు రెండూ లేవు. వీపుపైన కుర్తాపై మూడు కత్తిగాటు గుర్తులు.. రక్తం కారుతున్నట్టుగా ఉన్నాయి. మొత్తంగా ఉద్ధవ్ థాక్రేని రెబల్ ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిచారనే విధంగా స్కెచ్ గీశారు.

 

శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల కార‌ణంగా బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బుధవారం రాత్రి తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి అందజేశారు. తన కుమారులు ఆదిత్య థాక్రే, తేజస్ థాక్రేల‌తో పాటు శివసేన నేతలు నీలం గోర్హే, అరవింద్ సావంత్ స‌హా ప‌లువురితో క‌లిసి దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో ఉన్న రాజ్‌భవన్‌లో రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఆయ‌న‌ గవర్నర్‌ను కలిశారు. త‌న రాజీనామా లేఖ‌ను అందించారు. ఈ క్ర‌మంలోనే గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ రాజీనామాను ఆమోదించారు.

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే శివ‌సేన గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అయితే, సుప్రీంకోర్టు దీనికి నో చెప్ప‌డంతో ప్లోర్ టెస్టు అనివార్యం అయింది. దీంతో ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బుధ‌వారం రాత్రి రాజీనామా చేశారు.

కాగా..మ‌హావికాస్ అఘాడీ ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌డంతో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈమేర‌కు శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే, ఎమ్మెల్యేల‌తో బీజేపీ నేత‌లు సంప్ర‌దింపులు జ‌రిపారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల‌తో మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Related posts