స్వామి సన్నిధిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మి దంపతులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. శాలిగౌరారం మండలం చిత్తలూరులో శ్రీ శాంభవి శంభులింగేశ్వరస్వామి ఆలయంలో జరిగిన కల్యాణోత్సవంలో రాజగోపాల్ రెడ్డి దంపతులు పాల్గొనగా, వారికి కరెంట్ షాక్ తగిలింది. వేదికపై వీరిద్దరినీ సన్మానిస్తున్న వేళ, ఓ విద్యుత్ తీగ తెగి అక్కడే ఉన్న ఒక మహిళపై పడింది.
దానితో కరెంట్ షాక్ తో విలవిల్లాడుతున్న ఆమెను గమనించిన రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆమెను కాపాడబోయి కరెంట్ షాక్ కు గురై కింద పడిపోయారు. తన భార్య విలవిల్లాడుతుంటే, ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన రాజగోపాల్ కూ షాక్ కొట్టింది. అక్కడున్న వారు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన తరువాత భక్తులు ఆందోళనకు గురవుతుండగా, ఎవరికీ ఏమీ కాలేదని, అందరూ బాగానే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి భక్తులకు ధైర్యం చెప్పారు.
వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ.. పెరుగుతున్న మాటల యుద్దం!