telugu navyamedia
క్రైమ్ వార్తలు

పెళ్ళికి ఒప్పుకోలేద‌ని ప్రియురాలు తల నరికి.. స్టేషన్​కు తీసుకెళ్లిన యువకుడు..

పెళ్లికి అంగీకరించలేదన్న కక్షతో మాజీ ప్రేయసి తల నరికి హత్య చేయడంతో పాటు.. మొండెం నుంచి ఆమె తలను వేరు చేశాడు ఓ ఉన్మాది. నేరుగా పోలీసు స్టేషన్‌కు ఆ తలను తీసుకెళ్లాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కన్నబొరనయ్యన హట్టిలో గురువారం జరిగింది.

వివ‌రాల్లోకి వెళితే..

కూడ్లిగి తాలూకా కన్నిబొరయ్యహట్టికి చెందిన భోజరాజ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్. తన సమీప బంధువైన బసన్న కుమార్తె నిర్మల బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడిన భోజరాజ ఓసారి వారి ఇంటికెళ్లి పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించ‌క‌పోవ‌డంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

రెండు నెలల క్రితం భోజరాజకు మరో యువతితో వివాహమైంది.పొరుగు జిల్లాలో చదువుతున్న నిర్మల ఇటీవల స్వగ్రామానికి రాగా విషయం తెలిసిన భోజరాజ గురువారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆమెను హత్య చేసే ఉద్దేశంతో వెంట కత్తి తీసుకెళ్లిన భోజరాజ కత్తితో ఆమె తల నరికి హత్య చేశారు.ఆపై మొండెం నుంచి తలను వేరుచేసి దానిని సంచిలో వేసుకున్నాడు. కుడ్లిగి తాలూకాలోని ఖానాహోసహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts