telugu navyamedia
సినిమా వార్తలు

అద్భుతంగా మ‌హేష్ గోవా సీన్స్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కిర్తీ సురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా‘సర్కారు వారి పాట’ . బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు పరశురాం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హై ఓల్టేజ్ మాస్, యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అంతేకాదు ఓ హాలీవుడ్ సినిమాలా ఇందులో ఫైట్స్ ఉండబోతున్నాయి.

HBD Mahesh Babu -Sarkaru Vaari Paata : 'సర్కారు వారి పాట'లో మరోసారి దుమ్ము లేపిన మహేష్ బాబు.. అదిరిన సూపర్ స్టార్ స్టైలిష్ లుక్స్..

రీసెంట్ గా ఈ సినిమాలో కీలక భాగాన్ని ‘గోవా’ షూట్ చేశారు. అయితే నిన్నటితో ఈ గోవా షెడ్యూల్ షూట్ పూర్తి అయింది. ఈ షెడ్యూల్ లో మహేష్ అండ్ విలన్స్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు.

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట షూటింగ్ అప్డేట్.. గోవా బీచ్‌లో విలన్లను ఇరగదీస్తున్న మహేష్.. | Mahesh babu keerthi suresh sarkaru vaari paata movie goa schedule update | TV9 Telugu

క్రేజీ ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ఈ యాక్షన్ పార్ట్ ను కంపోజ్ చేశారు. ఇక ఈ యాక్షన్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా మహేష్ ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తాయట.

Sarkaru Vaari Paata: Mahesh Babu-Keerthy Suresh Starrer's Goa Schedule Begins - Filmibeat

 

ఇక త్వరలోనే మొదలు పెట్టబోయే షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ఉండనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ఉంటుంది. ఈ షెడ్యూల్ లో లవ్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. కీర్తి సురేష్ – మహేష్ కలయికలో ఈ సీన్స్ వస్తాయట. ఇక మ్యూజిక్ సెన్షేషన్ తమన్ ఈ సినిమాకి ఇచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలెట్‌గా నిలవనుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts