telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ బర్త్ డేకు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అభిమానులు

chiru

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందొ అందరికీ తెలిసిన విషయమే. ఇటీవలే చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చిరు ఇలా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగానే అతని అభిమానులు లక్షల్లో ఆయనను ఫాలో అవ్వడం ప్రారంభించారు. చిరు చిన్న పోస్టు పెట్టగానే వెంటనే దాన్ని వైరల్ చేసేస్తున్నారు. వచ్చేనెల చిరు పుట్టినరోజు ఉంది. సోషల్ మీడియాలో చిరు వచ్చాక ఆయన జరుపుకుంటున్న మొట్టమొదటి బర్త్ డే ఇది. దీంతో సోషల్ మీడియా షేక్ అయ్యేలా చేసేందుకు ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకుందాం అనుకున్న అభిమానుల ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో హీరోలంతా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. మెగాస్టార్ బర్త్ డే ఆగష్టు 22న అని అందరికీ తెలిసిందే. దీంతో ఆగస్టు మొత్తం చిరు పుట్టిన రోజు సందడి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం కామన్ డీపీలు, యాష్ ట్యాగులు మెగాస్టార్ ఫొటోలతో రచ్చ చెయ్యాలని అభిమానులు అనుకుంటున్నారు. అయితే చిరు బర్త్ డే కామన్ డీపీని ఇండియన్ టాప్ సెలెబ్రిటీలతో రిలీజ్ చేయించబోతోన్నారని సమాచారం.చిరు బర్త్ డే కోసం ఓ ప్రత్యేకమైన పాట కూడా కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ప్రముఖ ఆడియో కంపెనీ పనులు కూడా మొదలు పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే చిరు బర్త్ డేకు ఆయన అభిమానులు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేలాగే ఉన్నారు.

Related posts