telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

ఏపీలో స్కూళ్లు, కాలేజీల ఫీజులు ఖరారు

ఏపీలో విద్యాసంవత్సవరం మొదలు కావడంతో స్కూళ్లు, కాలేజీలు తీసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైమరీ స్కూళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ప్రాంతాల వారీగా నిర్ణయించింది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో దోపిడీని అరికట్టేందుకు తొలిసారి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఈ ఫీజులు రాగల మూడు విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వులు ఇచ్చింది.

హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఛైర్మన్‌గా పలువురు విద్యారంగ నిపుణులతో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ గతేడాది ఫీజులపై నోటిఫికేషన్ ఇచ్చినా న్యాయవివాదంతో అమలుకాలేదు. వాటిని పరిష్కరించుకుని ప్రభుత్వం జీవోలు 53, 54ను విడుదల చేసింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఫీజులను నిర్ణయించింది. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజును నిర్దేశించింది.

  • గ్రామ పంచాయతీల పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.10,000 హైస్కూల్ విద్యకు రూ.12,000
  • మున్సిపాలిటీల పరిధిలోని ప్రైమరీ విద్యకు రూ.11,000, హై స్కూల్ విద్యకు రూ.15,000
  • కార్పొరేషన్ల పరిధిలో ప్రైమరీ విద్యకు రూ.12,000, హై స్కూర్ విద్యకు రూ.18,000
  • గ్రామ పంచాయతీల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో MPC, Bi,PC కోర్సులకు రూ.15,000 ఇతర గ్రూపులకు రూ.12,000
  • మున్సిపాలిటీల్లోని కాలేజీల్లో MPC, Bi.PC కోర్సులకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15,000
  • మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీల్లో MPC, Bi.PC కోర్సులకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18,000

Related posts