మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్దవ్ ఠాక్రే.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగ లేఖ రాశారు. అందులో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమయం ఇంకా మించి పోలేదని.. ముంబైకు వస్తే చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. శివసేన ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదని అన్నారు. మీలో చాలా మంది మాతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కుటుంబ పెద్దగా నేను ఇప్పుడు కూడా మీ గురించి ఆందోళన చెందుతున్నాను. మీరు తిరుగుబాటు చేసినా, ఇప్పటికీ మీరంతా శివసేనతోనే ఉన్నారు. శివసైనికులు, ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించండి .
మీ గ్రూప్‌లోని కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను మాకు తెలియజేసారు’ అని ఉద్దవ్ లేఖలో పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేల రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ పెద్దగా మీ మనోభావాలను గౌరవిస్తాను మీరు ముందుకు వచ్చి మాట్లాడితే ఒక మార్గం కనుగొంటాం…మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలని’ ఠాక్రే ఆ లేఖలో సూచించారు.
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ సోయం తీవ్ర వ్యాఖ్యలు!