telugu navyamedia
రాజకీయ

ముఖేశ్ అంబానీ సంచలన నిర్ణయం.. ఆ కంపెనీ బోర్డుకు రాజీనామా..

*జియో డైరెక్ట‌ర్ ప‌ద‌వికి ముఖేశ్ అంబానీ రాజీనామా
*రిలయన్స్ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ నియామ‌కం

దేశీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్​ అధినేత ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. . రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్‌గా అంబానీ రాజీనామా చేశారు.ఆ కంపెనీ కొత్త ఛైర్మన్ గా తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు.

రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జూన్ 27న జరిగింది. ఈ సమావేశంలో బోర్డు పలు నిర్ణయాలను తీసుకుంది. ఇప్పటివరకు రిలయన్స్​ జియోలో నాన్​-ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా ఉన్న‌ ఆకాశ్ అంబానీని కొత్త‌ ఛైర్మన్‌గా నియమించేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదముద్రవేశారు.

ఈ వివరాలను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కంపెనీ సెక్రెటరీ జ్యోతి జైన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు వెల్లడించింది. రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ముకేశ్ అంబానీ తన పదవికి జూన్ 27న రాజీనామా చేశారని తెలిపింది.

అదేరోజు జియో మేనేజింగ్ డైరెక్టర్​గా పంకజ్ మోహన్ పవార్​ను నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జూన్ 27నే ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వివరించింది.

మరోవైపు, రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు స్పష్టం చేసింది. అయితే జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌కు ముకేశ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

అంబానీ స్థానంలో పంకజ్ మోహన్ పవార్‌ రిలయన్స్ జియో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. జూన్ 27 నుంచి అమలులోకి వచ్చింది. షేర్‌హోల్డర్స్ ఆమోదం తెలపాల్సి ఉంది.

Related posts