telugu navyamedia
రాజకీయ

గాంధీని చంపిన గాడ్సెకు శ‌త‌కోటివంద‌నాలు..

మహాత్మాగాంధీపై అనుచిత‌ వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజును రాయ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నాథూరామ్ గాడ్సేను అభినందిస్తూ కాళీచరణ్ మహరాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోకు 25 కి.మీ దూరంలోని బాగేశ్వర్ దామ్ సమీపంలో ఓ అద్దె ఇంటిలో ఉన్న కాళీచరణ్​ మహరాజ్​ను గురువారం తెల్లవారు జామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు రాయ్​పుర్​ ఎస్పీ ప్రశాంత్​ అగర్వాల్​ తెలిపారు.

ఇటీవల రాయ్‌పూర్ వేదికగా ధరమ్ సన్సద్ అనే ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న కాళీచరణ్.. జాతిపిత మహాత్మా గాంధీని దూషించి, గాంధీని చంపిన గాడ్సేపై పొగడ్తల వర్షం కురిపించాడు.

Soul Force': What Gandhi said and wrote after the Hindu-Muslim riots before  India's independence

అంతేకాకుండా మోహన్ దాస్ కర‌మ్‌చంద్ గాంధీ దేశాన్ని నాశనం చేశాడని.. అతన్ని చంపిన నాథూరామ్ గాడ్సేకు శతకోటి వందనాలు అని కాళీచ‌ర‌ణ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహంత్ రామ్ సుందర్ దాస్ ఈ వ్యాఖ్యలకు నిరసనగా వేదిక దిగి వెళ్లిపోయారు.ఆయన వెళ్లిపోవడం, కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో రంగంలోకి దిగిన రాయ్​పూర్​ పోలీసులు గురువారం ఉద‌యం కాళీచరణ్ ని అరెస్ట్ చేసి.. ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related posts