telugu navyamedia
క్రీడలు

టీమిండియా విజయభేరి..

టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయభేరి మోగించింది. ఇటు బ్యాటింగ్ లోనూ… అటు ఫీల్డింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో దక్షిణాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. లోకేశ్ రాహుల్ అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మూడు టెస్టు మ్యాచుల సిరీస్ లో టీమిండియా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

IND vs SA: Twitter Erupts As India Conquer South Africa's Fortress Centurion
=========
తొలి ఇన్నింగ్సులో 327 పరుగులు చేసిన భారత్ , రెండో ఇన్నింగ్సులో 174 పరుగులకు పరిమితమైంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో 197 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్సులో 191 పరుగులకు పరిమితమైంది. దక్షిణాఫ్రికా కెప్టన్ డీన్ ఎల్గర్ మినహాస్తే మరెవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు.
========
తొలి ఇన్నింగ్సులో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టడంతో పాటు, రెండో ఇన్నింగ్సులోమూడు వికెట్లను తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ల పాలిట టీమిండియా బౌలర్లు సింహస్వప్నంలా వ్యవహరించారు. పరుగులు సాధించడానికి నానా ఇబ్బందులు పడ్డారు.

Team India breach fortress Centurion: Cricketing fraternity hails Virat  Kohli and band for historic win - myKhel
======
సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాపై పోరాడటం కష్టమే అయినప్పటికీ… టీమిండియా అత్యుత్తమంగా రాణించిందని కెప్టన్ విరాట్ కోహ్లా అభిప్రాయం వ్యక్తంచేశారు. తొలి ఇన్నింగ్సులో లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ తో అద్భుతంగా రాణిస్తే… బౌలింగ్ ప్రదర్శనలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతుల్ని సంధించి దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకే పరిమితం చేశారని కోహ్లీ తెలిపారు. ప్రతి టెస్టు మ్యాచులోనూ పైచేయి సాధించే దిశగా జట్టు ఆడుతుందన్నారు.

Related posts