telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ

Devineni-uma

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహాలు మాయం కావడంపై విపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. ఈవో బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. సింహాలు పోయాయని క్లియర్‌గా కనిపిస్తుంటే ఇంకా ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారన్నారని అన్నారు.

మంత్రి వెల్లంపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆపకుండా వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడుతోందన్నారు.ఐఏఎస్ స్థాయి అధికారిని మార్చి ఎందుకు కింద స్థాయి అధికారిని ఈవోగా తీసుకువొచ్చారని దేవినేని ఉమ పేర్కొన్నారు. వెంటనే ఈవోని సస్పెండ్ చేసి ఒక పూర్తి స్థాయి జ్యూడిషల్‌ని దర్యాప్తు చేయాలన్నారు.

ఈ 16 నెలల్లో జరిగిన అన్ని ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. దేవాలయాలు, చర్చి, మసీదులపై దాడులను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అధికారులు, మంత్రి నిందితులను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Related posts