telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోంది: హోంమంత్రి

ap minister sucharita on fluds

ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.

మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని ఆమె చెప్పారు.ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోందని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.

Related posts