మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏపీ శాసనసభకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు ఒక్కరే మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ గా ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి 7 సార్లు విజయం సాధించారు.
మరోవైపు రెండుసార్లు పార్లమెంట్ పోటీ చేసి ఒకసారి గెలిచారు. 1996లో లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయ్యన్నపాత్రుడు. ఐదు సార్లు కేబినేట్ మంత్రిగా పనిచేశారు.
విభిజిత ఆంధ్ర ప్రదేశ్ 3వ శాసనసభ స్పీకర్ గా ఎన్నికయ్యారు.