telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ రోజు విశ్వాస పరీక్ష వాయిదా?: కమల్ నాథ్ సర్కారుకు ఊరట

Kamal_Nath mp

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభంలోపడిన కమల్ నాథ్ సర్కారు కు కాస్త ఊరట లభించింది. ఈ రోజు అజెంబ్లీ అజెండాలోని అంశాల్లో విశ్వాస పరీక్షను స్పీకర్ చేర్చలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ లో జ్యోతిరాదిత్య రూపంలో ముసలం మొదలైన విషయం తెలిసిందే. ఆరుగురు మంత్రులతోపాటు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, జ్యోతిరాదిత్య బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్రంలో కమల్ నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించారు.

ఇక గవర్నర్ ఆదేశాల మేరకు ఈ రోజు విశ్వాసపరీక్ష జరుగుతుందనుకున్నారు. విశ్వాస పరీక్షకు వెనుకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి కమలనాథ్ కూడా ప్రకటించారు. అయితే అసెంబ్లీ అజెండాలో చేరాల్సిన ఈ అంశం చేర్చలేదు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాల తీర్మానం తప్పించి విశ్వాస పరీక్ష అంశం ఎజెండాలో కనిపించలేదు. స్పీకర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బలపరీక్షకు సిద్ధమని సీఎం మరోసారి పునరుద్ఘాటించారు.

Related posts