కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో జరగాల్సిన సదస్సులు, క్రీడాపోటీలను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో పలు దేశాల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో-2020 రద్దు చేశారు.
స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు 90వ షోను రద్దు చేశామని జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండేందుకు మార్చి 15 వరకు 1,000 లేదా అంతకుమించిన జనసమూహాలతో పబ్లిక్ ఈవెంట్లను నిర్వహించకుండా నిషేధం విధించింది.