telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భూములు, స్థలాల ధరలు పెంపు .. నేటి నుండే అమలు..

AP

ఏపీ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో భూములు, స్థలాల ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం గురువారం 1 నుంచి జిల్లాలో అమల్లోకి రానుంది. ఇప్పటికే అధిక మార్కెట్‌ ధరలతో స్టాంపు రుసుం చెల్లించలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ కడపలో బహిరంగ మార్కెట్‌ ధరలను పరిగణనలోకి తీసుకుంటూ మార్కెట్‌ ధరలు నిర్ణయించిన ఉన్నత స్థాయి అధికారులు 5 నుంచి 10 శాతం మేర భూములు, స్థలాలు మార్కట్‌ ధరలు పెంచి క్రయ విక్రయ దారులకు మరింత భారం మోపారు.

ఆగష్టు 1 నుంచి భూములు, స్థలాల రేట్లు పెరుగుతున్నాయని తెలియగానే గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలన్నీ కిటకిటలాడాయి. స్టాంపు రుసుం భారం పడకుండా అప్పో సప్పో చేసి రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు.

Related posts