telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉచితంగా పెట్రోల్ .. ఆ కార్డు ఉంటె..

petrol prices raising day by day

ఒకపక్క పెట్రో ధరలు మండిపోతుంటే, ఉచితంగా ఎవరు ఇస్తారు అనుకోకండి. మార్గం ఉంది, ఏకంగా 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా వస్తే ఎలా ఉంటుంది. ఈ మాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి కదా. అవునండీ.. ఏకంగా 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందే మార్గం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి అద్భుతమైన ఆఫర్స్ కేవలం బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులకు మాత్రమే లభిస్తాయి. చాలాకాలంగా సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం కుదుర్చుకుని క్రెడిట్ కార్డులు ఇస్తోంది. ‘ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్’ పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ కార్డు ప్రత్యేకత ఏంటంటే… రివార్డ్ పాయింట్స్‌తో ఒక ఏడాదిలో 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.

ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్‌పై వారి ఔట్‌లెట్స్‌లో ఫ్యూయెల్‌పై సర్‌ఛార్జీ 1 శాతం తగ్గింపు ఉంటుంది. దాంతోపాటు ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో రూ.150 ఖర్చు చేస్తే 4 టర్బో పాయింట్స్ వస్తాయి. సూపర్‌మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లల్లో రూ.150 ఖర్చు చేస్తే 2 టర్బో పాయింట్స్ వస్తాయి. 1 టర్బో పాయింట్ విలువ రూ.1. ఇలా ఫ్యూయెల్‌పై ఏడాదిలో గరిష్టంగా 5000 వరకు టర్బో పాయింట్స్ పొందొచ్చు. అప్పుడు అక్షరాల 5,000 విలువ చేసే రివార్డులను పొందవచ్చు. ఇక ఆ టర్బో రివార్డ్ పాయింట్స్‌ను మళ్లీ ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో రీడీమ్ చేయవచ్చు. దీని ద్వారా సుమారు 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా లభిస్తుందని సిటీ బ్యాంక్ వెల్లడించింది.

Related posts