కరోనా మహమ్మారి కర్నూలు జిల్లాను వానికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. తాజాగా బయట పడిన ఐదు కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య తొంబై ఎనిమిదికి చేరింది.
జిల్లాలో ఇప్పటి వరకు బాధితుల్లో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు వైరస్ నుంచి కోలుకోవడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు. కొన్ని జిల్లాల్లో పెరుగుతున్న కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
యురేనియం తవ్వకాల పై స్పందించిన అఖిలప్రియ