telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాలన వికేంద్రీకరణపై ఏపీ హైకోర్టులో విచారణ

ap high court

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రస్తుత స్టేటస్ కోను వచ్చేనెల 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసంనం ఆదేశించింది. . ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు ధర్మాసనం గడువు ఇచ్చింది. అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. 

ఈ రోజు విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో అమల్లో ఉన్న సమయంలో అతిథిగృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆయన తెలిపారు.

Related posts