telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమ్ముడు సినిమా లెక్కలేనన్ని సార్లు చూసా : వరుణ్ తేజ్

Varun-Tej

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో లాక్‌డౌన్ సమయాన్ని మే 3 వ‌ర‌కు పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కి మ‌ద్దతు తెలుపుతూ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ ఇంటిలో తాను ఈ క్వారంటైన్ స‌మ‌యాన్ని ఎలా గ‌డుపుతున్నారో ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఈ సందర్భంగా ఓ అభిమాని మీకు ఎలాంటి సినిమాలు నచ్చతాయి అన్నదానికి యాక్షన్ సినిమాలు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తమ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒక్కో మాటలో చెప్పుకొచ్చాడు. పెదనాన్న చిరంజీవి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. నాన్న నాగబాబు నా బలం. ఇక పవన్ కళ్యాణ్ నిజాయితీ మారు పేరు అంటూ పేర్కొన్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ మంచి హార్ట్ వర్కర్స్ వాళ్ల నుంచి సినిమా కోసం ఎంతలా కష్టపడాలో నేర్చుకున్నాన్నారు.

ఇక బాలీవుడ్‌లో తన ఫేవరేట్ హీరో షారుఖ్ ఖాన్ అని చెప్పారు. మరోవైపు కామిక్ హీరోల్లో బాట్ మేన్ ఆల్ టైమ్ ఫేవరేట్ అని చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఏ సినిమా ఫేవరేట్ అడగగా తమ్ముడు సినిమా పేరు చెప్పాడు ఆ సినిమా లెక్కలేనన్ని సార్లు చూశానని చెప్పాడు. ఇక క్వారంటైన్‌లో ఇపుడు స్నూకర్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. మరోవైపు ఆన్‌లైన్‌లో గిటార్ నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నా నెక్ట్స్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్నాను. ఈ సందర్భంగా ఓ కోచ్‌ను నాతో పాటు ఉంటున్నాడు. ఆయనతో రోజు బాక్సింగ్ క్లాసులు తీసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఇక లాస్ట్ క్రష్ ఎవరన్న దర్శకుడు హరీష్ శంకర్ ప్రశ్నకు తనతో లాస్ట్ సినిమా గద్దలకొండ గణేష్ సినిమా తీసిన హరీష్ శంకర్ పేరును చెప్పకనే చెప్పాడు. మరోవైపు మంచి కథ దొరికితే సాయి ధరమ్ తేజ్‌తో పాటు మిగతా మెగా హీరోలందరితో సినిమాలు చేస్తానన్నాడు. త్వరలో ఎఫ్ 3 సంబంధించిన అప్‌డేట్ ఇస్తానన్నాడు.

Related posts