telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. శంషాబాద్‌లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం ఈ ప్రకటన వెలువడింది.

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవికి పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు పోటీపడ్డారు. అధిష్టానం బుజ్జగించినా ఇద్దరు నేతలు వినకపోవడంతో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

హైదరాబాద్, ఖమ్మం జిల్లా నేతలు కూనంనేని సాంబశివరావుకు మద్దతు తెలపగా, నల్లగొండ జిల్లా నేతలు పల్లా వెంకటరెడ్డికి సపోర్ట్ గా నిలిచారు. నిన్న అర్థరాత్రి వరకూ ఈ ఎన్నిక జరిగింది..

ఈ ప్రక్రియలో మొత్తం 110 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కూనంనేనికి 59 ఓట్లు, పల్లా వెంకట్‌రెడ్డికి 45 ఓట్లు పడగా.. చెల్లనివిగా 7 ఓట్లు తేలాయి. చివరికి 15 ఓట్ల మెజారిటీతో కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. దీంతో కూనంనేని సాంబశివరావు విజయం సాధించినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

 కూనంనేని సాంబశివరావు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఐ 3వ మహాసభ వరకు తెలంగాణసహాయ కార్యదర్శిగా కూడా కూనంనేని సాంబశివరావు పనిచేశారు.

 

Related posts