telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆర్టీసీ మహిళా ఉద్యోగులు..ఉదయాన్నే డ్యూటీకి రావాలి…

no night duties to women rtc

ఇటీవలే మహిళ కండక్టర్లు రాత్రి ఎనిమిది గంటల లోపు మాత్రమే విధుల్లో ఉండాలి అని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వారికి రాత్రి డ్యూటీలు వేయకూడదు. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలివి. ఈ నిర్ణయంపై మహిళా కండక్టర్లన నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. సీఎం ఆదేశాలు అమలు చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాత్రి 8 గంటల లోపు మాత్రమే మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేస్తున్నా.. వేకువ జామునే డ్యూటీకి రావాలని పలు డిపోల్లో పెట్టిన నిబంధన ఇబ్బందికరంగా మారింది.

నగరంలోని 29 డిపోల పరిధిలో పని చేస్తున్న ఆర్టీసీ మహిళ కండక్టర్లకు రాత్రి షిప్టుల్లో డ్యూటీలు వేయడం లేదు. కానీ, తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యే ఉదయం షిప్టునకు వస్తే మధ్యాహ్నం 2గంటల వరకు డ్యూటీ సమయం ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆయా డిపోల పరిధిలో బస్సులు బయలుదేరే సమయానికనుగుణంగా డ్యూటీ ప్రారంభమవుతున్నందున మ హిళ కండక్టర్లు తెల్లవారుజామున 4గంటల నుంచి అందుబాటులో ఉండాలంటున్నారు. నగరంలోని డిపోల్లో బస్సులు ఉదయం 4గంటల నుంచి బస్సులు తిరుగుతుంటాయి. దీంతో ఆయా బస్సుల్లో విధులు నిర్వహించాలని చెబుతున్నారు. తెల్లవారుజామున 4గంటల నుంచి ఉదయం 8గంట ల మధ్యలో డ్యూటీకి వస్తే మధ్యాహ్నం వరకు విధులు పూర్తవుతాయని భావించి, అందుకనుగుణంగా మహిళ కండక్టర్లను విధులకు రమ్మని చెబుతున్నారు.

Related posts