telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్యూన్స్ కాపీ కొడితే మా అమ్మ అన్నం పెడుతుందా ? : తమన్

Thaman

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. స్టార్ హీరోలతో కలిసి పని చేసిన ఆయన ఇప్పటికే ఎన్నో హిట్ సాంగ్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సంగీత దర్శకుడిగా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తమన్‌ ట్యూన్స్ కాపీ చేస్తారన్న పుకార్లు కొత్తగా వచ్చినవి కాదు. కొద్ది కాలంగా ఆయనపై ఈ విషయంలో దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయన పాట ఏదైనా రిలీజ్ అయ్యిందంటే చాలు.. ఆ పాట ఏ పాటకు మ్యాచ్ అవుతుందో చూడటం.. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గత కొంత కాలంగా జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ యూట్యాబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. “ఆ సాంగ్ కాపీ కొడుతున్నాను తీసుకోండి అంటే డైరెక్టర్ ఒప్పుకుంటారా? ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారా? అసొసియేట్ డైరెక్టర్ ఒప్పుకుంటారా? నా ట్యూన్‌ను ఓకే చేయాల్సిన మధ్యలో వాళ్లు లక్ష మంది ఉంటారు. డైరెక్టర్ ఇంట్లో వాళ్ల ఫ్యామిలీ, హీరో వాళ్ల ఫ్యామిలీ… మా ఇంట్లో మా ఫ్యామిలీ వింటారు. నేను కాపీ ట్యూన్ తీసుకెళ్లి మా ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా? ‘ఏంట్రా ఆ ట్యూన్‌లాగే ఉంది. కొట్టేశావా?’ అంటే ఏం చెప్పాలి?” అని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

Related posts