telugu navyamedia
తెలంగాణ వార్తలు

గౌతమ్‌రెడ్డి అకాల మరణం షాక్‌కి గురిచేసింది: కేటీఆర్‌

*గౌత‌మ్‌రెడ్డి భౌతిక‌కాయాన్ని నివాళులర్పించిన కేటీఆర్‌..
*గౌతమ్‌రెడ్డి తండ్రిని ఓదార్చిన కేటీఆర్‌..
*గౌతమ్‌రెడ్డి నాకు అత్యంత స‌న్నిహితుడు..
*ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు గౌతమ్‌రెడ్డి
*గౌత‌మ్‌రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది..
*మంచి మిత్రుడిని కోల్పోవ‌డం బాధాక‌రం..

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు… గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళుర్పిస్తున్నారు.

ఈ క్ర‌మంలో గౌతమ్‌రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని మేకపాటి నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్.. గౌత‌మ్‌రెడ్డి భౌతిక‌కాయాన్ని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ…గౌతమ్‌రెడ్డితో నాకు 12 ఏళ్లుగా పరిచయం ఉంద‌ని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు గౌతమ్‌రెడ్డి అని కొనియాడారు. కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాఅని అన్నారు.

Related posts