telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునుగోడు ప్ర‌చారానికి వెళ్ల‌ను..పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదు

*మునుగోడులో స‌భ పెట్టి న‌న్ను తిట్టించారు..
*కాంగ్రెస్ ను వీడ‌ను..
*సోనియా, రాహుల్ ద‌గ్గ‌రే తేల్చుకుంటా..
*న‌న్ను బ్రాందీ షాప్‌లో ప‌నిచేసే వాడితో పోలుస్తాడా..?
*జానారెడ్డిఇంటికి వెళ్తారు..నా ఇంటికి రావ‌డానికి ఏంటి ఇబ్బంది.

టి.పీసీసీ ఛీప్‌ఫై రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటెరెడ్డి మ‌రోసారి కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు ఉపఎన్నికకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు .ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు ప్ర‌జ‌లు స‌రైన నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆయ‌న అన్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. .మునుగోడు ఉప ఎన్నికపై జరుగుతున్న సమావేశాలకు ఎలాంటి ఆహ్వానం లేదని, పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు.

దాసోజు శ్రవణ్‌ మాట్లాడిన ప్రతిమాటా కరెక్టే అంటున్నారు వెంకటరెడ్డి. తనను తిట్టిన అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. మునుగోడు సభలో తనను కావాలని తిట్టించారని అన్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

జానారెడ్డి ఇంటికి వెళ్తారు కానీ.. మా ఇంటికి రాలేదన్నారు. నన్ను బ్రాందీ షాప్‌లో పని చేసిన వాళ్ళతో పోలుస్తాడా..? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడను.

నన్ను అవమానిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతాను అనుకున్నారు. అన్ని విషయాలు సోనియా, రాహుల్ ద‌గ్గ‌రే తేల్చుకుంటాన‌ని అన్నారు.నాపై అద్దంకి చేసిన వ్యాఖ్యలకు ఆ సమావేశంలోనే క్షమాపణ చెప్పాల్సిందని అన్నారు.

రేవంత్ ఆస్తులు ఎన్ని? రాజగోపాల్ ఆస్తులు ఎన్ని తేల్చాలన్నారు.రేవంత్ రెడ్డి ఏం వ్యాపారాలు చేసి సంపాదించారో చెప్పాలని కోరారు.

Related posts