telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో బెంచ్‌లు పెంపుపై కేసీఆర్ హ‌ర్షం..

*తెలంగాణ న్యాయాధికారుల స‌ద‌స్సు..
*స‌ద‌స్సుకు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌ ర‌మ‌ణ‌, సీఎం కేసీఆర్ హాజ‌రు..
*తెలంగాణ‌లో బెంచ్‌లు పెంపుపై కేసీఆర్ హ‌ర్షం..
*తెలంగాణ హైకోర్టుకు మరిన్ని బెంచ్‌లు కల్పించినందుకు సీజేఐకు కేసీఆర్ ధన్యవాదాలు
*తెలంగాణ అన్ని రంగాల్లో ఆర్థికంగా పురోగ‌మిస్తోంది..
*33 జిల్లాల‌లో ప‌రిపాల‌న సౌల‌భ్యం పెంచుకున్నాం..

హైకోర్టు విభజన జరిగాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టుకు బెంచ్‌లు సంఖ్య పెరిగిందని  సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో న్యాయాధికారుల సదస్సు జరిగింది. . ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు…8 ఏళ్ల క్రితం తెలంగాణ.. రాష్ట్రంగా ఆవిర్భవించింది. అందరి సహకారంతో చక్కగా పురోగమిస్తోంది. పటిష్ట ఆర్థిక పురోగతిని సాధిస్తున్నామ‌ని. విద్యుత్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశాం.

తెలంగాణ హైకోర్టులో బెంచ్‌‌లు పెంచినందున ఆనందంగా ఉంది. అందుకు తగ్గట్లుగా కోర్టు సిబ్బందిని కూడా పెంచుతామని కేసీఆర్ చెప్పారు. హైకోర్టులో 860 పోస్టులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

జిల్లా కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక జరుగుతోంది. హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ క్వార్టర్స్‌ నిర్మిస్తాం. 42 మంది న్యాయమూర్తులకు ఒకేచోట క్వార్టర్స్‌. క్వార్టర్స్‌ నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలం సిద్ధంగా ఉంది. ఈ ఏడాదే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాని కేసీఆర్ తెలిపారు.

Related posts