telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అన్ని స్కూళ్లకు ఇంటర్‌నెట్..పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారి

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ విద్యాశాఖ‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించారు.

అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరినాటికే సిద్ధం చేయాలన్నారు వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని, దశలవారీగా డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ సూచించారు.

రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలన్న సీఎం జగన్‌
గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా వీరిని కలిసి అవగాహన కల్పించాలన్నారు.
అలాగే విద్యార్థినుల సమస్యలపై మహిళా టీచర్ ద్వారా కౌన్సెలింగ్ఇ ప్పించాలని ఆదేశించారు

Related posts