మొదటిసారిగా తన పార్టీ ఓటమిపై బాలకృష్ణ స్పందించాడు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు చివరి వరకు అండగా ఉంటానని అన్నారు. అధికారపక్షం సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు.
ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య సతీమణి వసుంధరతో హిందూపురంలో పర్యటించారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లేపక్షి, చిల్లమత్తూరు, హిందూపురం.. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.