telugu navyamedia
తెలంగాణ వార్తలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర కేసు: నిందితులకు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్..

*మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితులకు బెయిల్.
* ష‌ర‌తూల‌తో కూడి బెయిల్ మంజూరు చేసిన మేడ్చ‌ల్ కోర్టు ..

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రకేసులో నిందితులకు మేడ్చల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.ఈ కేసులో అరెస్టయిన ఏడుగురికి నిందితులకు ష‌ర‌తూల‌తో కూడిన బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

శ్రీనివాస్ గౌడ్​ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో నిందితులైన ఏడుగురికి బెయిల్​ అంశంపై ఇప్పటికే మేడ్చల్​ సెషన్స్​ కోర్టులో రెండుసార్లు పిటిషన్​ దాఖలు చేశారు. మొదటిసారి వేసిన పిటిషన్​ను న్యాయస్థానం కొట్టివేయగా.. రెండోసారి మళ్లీ పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్​పై మార్చి 15న చేపట్టిన విచారణలో.. నిందితులకు బెయిల్ ఇస్తే సాంకేతిక ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని… దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ రోజుకి వాయిదా వేసింది.

మొత్తానికి ఏడుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. నిందితులకు రూ.40 వేలు పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే.. వారానికి 2 రోజులు పేట్​ బషీరాబాద్‌ పోలీస్​స్టేషన్​లో సంతకాల కోసం హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్ర‌స్తుతం నిందితులంతా ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. బెయిల్ ఉత్తర్వులు అందితే ఈరోజు సాయంత్రమే వారంతా బయటకు వచ్చే అవకాశాలున్నాయి.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రకేసులో ఏ1 నిందితుడి గా రాఘవేందర్ రాజు, ఏ5గా మున్నూరు రవి, ఏ6గా మధుసూధన్ రాజు, ఏ7గా అమరేందర్ రాజు, ఏ8గా జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను పోలీసులు చేర్చారు.

గతేడాది ఆగస్ట్ 3వ తేదీన రాఘవేందర్ రాజు ఇంట్లోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేశారని, అక్కడ కుదరకపోతే మహబూబ్‌నగర్‌లో ఎక్కడ హత్య చేయాలనే దానిపై కూడా నిందితులు పక్కా స్కెచ్ వేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ను కూడా హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో రూ.15కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts