telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హైకోర్టు సంచలన తీర్పు… 8 మంది ఐఏఎస్ ల‌కు జైలు శిక్ష

*కోర్టు ధిక్క‌ర‌ణ పై హైకోర్టు ఆగ్ర‌హం..
*8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష..
*సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని కోర్టు ఆదేశం..

అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది.

పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో 8మంది ఐఏఎస్‌లకు విజయ్ కుమార్ , గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్, రాజశేఖర్, చిన వీరభద్రుడు, జె. శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్ ల‌కు రెండు వారాల పాటూ జైలు శిక్ష విధించింది.

ఈ విషయమై ధర్మాసనాన్ని ఐఎఎస్ లు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో కోర్టు జైలు శిక్షకు బదులుగా ఐఏఎస్ అధికారులు అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి నెల ఏదో ఒక రోజు సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.

Related posts