కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ పురపాలక కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఖాజా, ఇఫ్రాన్‌లు ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకున్నారు. .
మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డికి, అదే పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ల భాష మధ్య అభివృద్ధి పనులపై వాగ్వాదం చోటు చేసుకుంది.
వైస్ చైర్మన్ బంగారు ముని రెడ్డికి మద్దతుగా మరో వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్, కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవిలు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషపై దాడికి యత్నించారు.
ఈక్రమంలో కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. కౌన్సిల్ హాల్‌లోనే కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది
ఎస్సీ వర్గీకరణపై ఏపీలో జగన్ వైఖరి తెలపాలి: మాజీ ఎంపీ హర్షకుమార్