టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపచువ్వతో దాడికి పాల్పడ్డారు. పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద పైప్‌లైన్ మరమ్మతులు చేయిస్తుండగా గాంధీపై వైసీపీకి చెందిన వర్గీయులు దాడి చేసి గాయపర్చారు.
కంటి గుడ్డుకు తీవ్రగాయాలు కావడంతో తాడిగడప ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు.
గాంధీని పరిక్షించిన వైద్యులు ఒక కన్ను చూపు కోల్పోయినట్లు ధృవీకరించారు. దీంతో రెండో కన్నుకు ఇన్ఫెక్షన్ రాకుండా వైద్యుల చర్యలు తీసుకుంటున్నారు. ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
కాగా.,, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుదాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాంధీ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు
గాంధీపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే టీడీపీ నేతలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.