telugu navyamedia
తెలంగాణ వార్తలు

తనను కాంగ్రెస్ నుండి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోంది : రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడను

*నేను బీజేపీలోకి వెళ్తే చెప్పే వెళ్తా..
*  తెలంగాణలో వ‌ర‌ద‌ల‌పై చ‌ర్చించా..
న‌న్ను అడ‌గ‌కుండా చెరుకు సుధాక‌ర్‌ను పార్టీలో చేర్చుకున్నారు.
పాత కాంగ్రెస్ నేత‌ల‌ను వెళ్ల గొడుతున్నాడు..టీడీపీ నేత‌ల‌కు టికెట్ ఇస్తాడేమో

కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వేర్వేరుగా కలిశారు. ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవగా.. తర్వాత రాజగోపాల్ రెడ్డి కలిశారు.

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన అనంత‌రం వెంక‌ట‌రెడ్డి మీడియా మాట్లాడుతూ.. తాను రాజకీయాలపై మాట్లాడటానికి కలవలేదని.. తెలంగాణకు వరద సాయం చేయాలని కోరేందుకు అమిత్ షాను కలిసినట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తు చేశారు. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు. అమిత్ షాతో భేటీ అయినంత మాత్రాన పార్టీ మారేది లేదన్నారు.

ఒక వేళ వెళ్లానుకుంటే బరాబర్ చెప్పే వెళ్తానని, నేను ఎవరికీ భయపడేది లేదన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని.. తన నియోజకవర్గ పరిధిలో తనను అడగకుడా సభను ఏర్పాటు చేయడమేమిటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. పాత కాంగ్రెస్‌ నేతలందరినీ పార్టీ నుంచి వెళ్లగొడుతున్నావు. కాంగ్రెస్‌ వాళ్లంతా పోతే టీడీపీ వాళ్లని చేర్చుకుంటారా? అంటూ రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు.

తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. మునుగోడులో గెలవబోయేది ఎవరో తనకు తెలుసని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఏదో చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలపై సోనియా, రాహుల్ వద్దనే తేల్చుకుంటానని వెంకటరెడ్డి తెలిపారు. చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్న అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ఆయన రేవంత్ రెడ్డి ముఖం చూడనని ప్రకటించారు.

Related posts