telugu navyamedia
తెలంగాణ వార్తలు

బ్రేకింగ్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యకు కుట్ర

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని… ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది.
.
జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని ప్రసాద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని దగ్గర కత్తి, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్‌ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్త ప్రసాద్‌గౌడ్‌గా గుర్తించారు. తన భార్య లావణ్యను ను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేసే చేయడంతో ఎమ్మెల్యేపై ప్రసాద్‌గౌడ్‌ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

Related posts