యాంకర్ రష్మి షేర్ చేసి ఈ ఫొటోలు చూస్తే గోదారి రుచులు ఎంత స్వీటో అర్థమైపోతుంది. నోరు ఊరిపోతుంది. గోదావరి రుచుల్లో తాపేశ్వర్ స్వీట్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆ ఖైరతాబాద్ వినాయకుడు లడ్డూ మొదలు.. దేశ విదేశాల్లో తాపేశ్వరం స్వీట్స్ రుచి చూడని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. అంతలా ఈ స్వీట్స్‌కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇక తాపేశ్వర్ మడత కాజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అంగుళం నుంచి అడుగులు లెక్క కాజాలను మడత పెట్టేయడం ఇక్కడ స్పెషాలిటీ. తాపేశ్వరం మడత కాజా రుచి చూస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది రష్మి. ఫొటో పాతదే అయినా కొత్తగా షేర్ చేసింది రష్మి. రెండు చేతులతో పట్టుకున్నా సరిపోనట్టుగా ఉన్న కాజాని నోట్లో పెట్టుకుంటూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. పాకం కారిపోతూ ఉన్న పెద్ద కాజాని కొరుకుతూ.. నోట్లో పట్టించేస్తుంది రష్మి. ప్రస్తుతం రష్మి షేర్ చేసిన ఈ తాపేశ్వరం కాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.