తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ఐదుగురు కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,35,656కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,16,352 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్త్రంలో మొత్తం 1,324 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 90.3శాతంగా ఉంటే.. స్టేట్లో 91.40 శాతానికి పెరిగిందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 17,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 41,962 కరోనా పరీక్షలు నిర్వహించగా..మొత్తం టెస్టుల సంఖ్య 41,96,958 కు పెరిగింది.
బాబు అప్పుడు హైదరాబాద్ వదిలివచ్చారు..ఇప్పుడు అక్కడికే పారిపోయారు!