telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్ : బాలకృష్ణ 105 సినిమా టైటిల్ ఇలా రివీల్ చేశారేంటి ?

balakrishna new avatar for 105th movie

నట సింహం నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో ఇటీవలే ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. “జైసింహా” వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో బాలయ్య ఇది వరకు ఎప్పుడూ కనిపించని విధంగా కనపడుతున్నారు. యంగ్ లుక్‌లో, ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న బాలయ్యను చూసిన నందమూరి అభిమానులు థ్రిల్ అయ్యారు. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల భోగట్టా. అయితే ఈ సినిమాకు మొదట్లో ‘రూలర్’ అనే టైటిల్ ని పెడతారని అందరూ భావించారు, ఇక రెండు రోజుల క్రితం టైటిల్ అది కాదు, ‘జడ్జిమెంట్’ అనే టైటిల్ ని ఆ సినిమా యూనిట్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది కూడా ఒట్టి పుకారేనని తెలుస్తోంది. అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిన జెమినీ టీవీ సంస్థ, తాము నేడు బాలకృష్ణ గారి 105వ సినిమా అయిన “రూలర్” సినిమా హక్కులను కొనుగోలు చేయడం జరిగిందంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనితో బాలకృష్ణ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు అందరికి ఒక్కసారిగా రివీల్ అయింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Related posts