telugu navyamedia
సినిమా వార్తలు

జలపాతానికి అమితాబ్ పేరు… ఆశ్చర్యంలో బిగ్ బీ

Amitab

బాలీవుడ్ మెగాస్టార్ 76 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సైరా”లో కీలకపాత్రలో నటించారు. తమిళంలోనూ ఆయన తన తొలి సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్, సాహోజిత్ సర్కార్ దర్శకత్వంలో “గులాబో సితాబో” అనే సినిమా చేస్తున్నారు. తాజాగా అమితాబ్ కు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… ప్రకృతి అందాలకు నెలవైన సిక్కిం రాష్ట్రంలో ఎత్తైన జ‌ల‌పాతం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ జలపాతం పేరు “అమితాబ్‌ బచ్చన్‌ వాటర్‌ ఫాల్స్‌”. నార్త్‌ సిక్కిం జిల్లాలోని లాచుంగ్‌ ప్రాంతంలో ఉన్న ఆ జలపాతం అసలు పేరు భీవ్మా. బిగ్‌బీ నటించిన ‘ఆంఖే’ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని భీవ్మా వాటర్‌ఫాల్స్‌ వద్ద యాభైరోజుల పాటు షూట్‌ చేశారు. అప్పట్నుంచీ స్థానిక డ్రైవర్లూ, పర్యటకులూ ఆ జలపాతాన్ని అమితాబ్‌ బచ్చన్‌ వాటర్‌ ఫాల్స్‌గా పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ విష‌యం బిగ్ బీకి ఇంత వ‌ర‌కు తెలియ‌ద‌ట‌. ఓ అభిమాని ట్వీట్‌తో తన పేరు మీద ఉన్న ఒక జలపాతం గురించి తెలుసుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఓ నెటిజ‌న్ జ‌ల‌పాతం ముందు ఫోటో దిగి.. బిగ్ బిని ట్యాగ్ చేశాడు. దీనిని బ‌చ్చ‌న్ రీట్వీట్ చేస్తూ “ఇది నిజం కాదు… అది జలపాతం పేరు” అని తెలిపాడు. సింగపూర్‌లోని ఓ ఆర్కిడ్‌జాతి మొక్కకూ బిగ్‌బీ పేరు పెట్టిన విష‌యం తెలిసిందే.

Related posts