telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తలలేని మొసలిని చూసి ఆమె ఏం చేసిందంటే ?

Alligator

కింబర్లీ కుకిచ్ అనే యువతి సరాసొటాలోని తల్లిదండ్రుల దగ్గరకు సోమవారం కారులో వెళ్తోంది. హైవేపై వెళ్లే సమయంలో కుకిచ్‌కు రోడ్డు పక్కన పెద్ద మొసలి కనిపించింది. మొసలికి తల లేకపోవడం చూసి కుకిచ్ కారు ఆపి మొసలి దగ్గరకు వెళ్లింది. తల లేని మొసలిని చూసి కుకిచ్ షాకైంది. ఎవరో మొసలి తలను ఱంపం పెట్టి నరికేసినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి కారణమైన వారిని పట్టుకుంటామని, చట్టప్రకారం మొసలి అవయవాలను వేరు చేసి తీసుకెళ్లడం నేరమని అధికారులు వెల్లడించారు. మొసలిని పరిశీలించిన పోలీసులు ఏదో వాహనం మొసలిని బలంగా ఢీకొట్టి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మొసలి చనిపోయిన అనంతరం దుండగులు తలను ఎత్తుకెళ్లిపోయి ఉండచ్చని తెలిపారు. నిందితుల వివరాలు వెల్లడించిన వారికి తగిన పారితోషికం అందిస్తామని పోలీసులు ప్రకటించారు.

Related posts