telugu navyamedia
క్రీడలు వార్తలు

తన తప్పుడు జోస్యం పై స్పందించిన మైఖేల్ వాన్…

ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత భారత్ 4-0తో క్లీన్ స్వీప్ అవుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పాడు. ఓ వైపు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఆసీస్ జట్టులోకి రాగా.. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద సిరీస్ నుంచి తప్పుకోవడం.. అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడటంతో వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌పై గెలవడం దేవుడెరుగు గట్టి పోటినిస్తే చాలని చాలా అవహేళనగా మాట్లాడాడు. మైఖేల్ వానే కాదు ఆసీస్ మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ కూడా ఇలానే మాట్లాడారు. కానీ కోహ్లీ గైర్హాజరీలో సారథ్య బాధ్యతలు అందుకున్న రహనే జట్టును అద్భుతంగా నడిపించాడు. ముందుగా మెల్‌బోర్న్ టెస్ట్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో విజయాన్నందించి సిరీస్‌లో లెక్కను సరిచేశాడు. ఆ తర్వాత అశ్విన్- విహారీ అసాధారణ పోరాటంతో సిడ్నీ టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్.. యువ ఆటగాళ్ల సాయంతో ఆసీస్ గబ్బా కోటను బద్దలు కొట్టి 2-1తో సిరీస్‌నే కైవసం చేసుకుంది. దీంతో మైఖెల్ వాన్, ఆసీస్ మాజీ క్రికెటర్లపై భారత అభిమానులు తీవ్ర ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా దీనిపై స్పందించిన మైఖేల్ వాన్.. భారత్ చారిత్రాత్మక విజయం తన ముఖంపై గుడ్లతో కొట్టినట్లుగా ఉందని పేర్కొన్నాడు. భారత జట్టుపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు. అయితే భారత్ విజయాన్ని ఆ దేశ అభిమానులు కూడా ఊహించలేదని, తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనన్నాడు. ‘అడిలైడ్ విజయం తర్వాత ఆస్ట్రేలియా 4-0తో భారత్‌ను చిత్తు చేస్తుందనుకున్నా. కానీ ఆటగాళ్ల ఎంపిక, గాయాలు ఇలా పలు సమస్యలు వెంటాడినప్పటికీ టీమిండియా పుంజుకుని బాగా ఆడింది. అయితే దీన్ని భారత్​ అభిమానులు కూడా ఊహించి ఉండరు. కానీ భారత్ విజయం నా ముఖంపై గుడ్లతో కొట్టినట్లుగా ఉంది.

Related posts