కాంగ్రెస్ పై ఉన్న విసుగుతోనే దేశ ప్రజలు బీజేపీకి ఓటేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. శాసనసభలో బడ్జెట్ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. పన్నులు వసూలు చేసే బాధ్యత మాత్రమే కేంద్రానికి ఉందని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీలేదని విమర్శించారు.
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతి అని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశాన్ని భ్రమింపజేసే పిచ్చి ప్రయత్నంలో కాంగ్రెస్ ఉండేదని, ఇప్పుడు బీజేపీ కూడా ఆ విధంగానే తయారైందని విమర్శించారు.