telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత కరోనా అప్డేట్…

corona vaccine India

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో భార‌త్‌లో కోటి మార్క్‌ను క్రాస్ చేశాయి క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు. గడచిన 24 గంటలలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 347 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 35,087 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,04,599 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 3,13,831 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 95,50,712 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,45,136 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 96.88 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 3.34 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.45 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 11,71,868 కు చేరింది.

Related posts