telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ లేకపోవడం రోహిత్ శర్మ కు గొప్ప అవకాశం…

rohit double century in 3rd test

యూఏఈ లో ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్ళింది. అయితే ఈ టూర్ లో భాగంగా జరిగే టెస్ట్ సిరీస్ లో కోహ్లీ లేకపోవడం రోహిత్ కు లాభం చేకూరుస్తుంది అని ఆస్ట్రేలియా మాజీ స్టార్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. అయితే ఐపీఎల్ లో గాయపడిన రోహిత్ పూర్తి ఫిట్‌నెస్‌ తిరిగి పొందడానికి అతడికి వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. కానీ టెస్ట్ జట్టులోకి తీసుకుంది. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అడిలైడ్ లో జరిగే మొదటి డే-నైట్ టెస్ట్ మాత్రమే ఆడి అతను తిరిగి భారత్ కు రానున్నాడు. దాంతో కోహ్లీ లేకపోవడంతో భారత ఓపెనర్ రోహిత్ శర్మ కు గొప్ప అవకాశం అని మెక్‌గ్రాత్ అన్నాడు. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. కానీ అతను ఈ సుదీర్ఘ ఫార్మాట్ లో అంతగా ఏమి సాధించలేదు. కాబట్టి ఇప్పుడు కోహ్లీ స్థానంలో రోహిత్ రాణిస్తాడు అని మెక్‌గ్రాత్ అన్నాడు. అలాగే కోహ్లీ లేనంత మాత్రాన భారత జట్టు బలహీనం కాదు. అందులో రహానె, పుజారా, కేఎల్ రాహుల్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు అని గ్లెన్ మెక్‌గ్రాత్ తెలిపాడు. చూడాలి మరి ఈ సిరీస్ లో ఎవరు రాణిస్తారు అనేది.

Related posts