నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు కేంద్రమంత్రి రాందాస్ అథవాలేబంపర్ ఆఫర్ ఇచ్చారు. సోమవారం ముంబైలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశం అనంతరం మీడియా సమావేశంలోలో ఆయన మాట్లాడుతూ శివసేనతో ఉండడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం మాతో చేతులు కలపమని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.
ఎన్డీయేలో చేరితే భవిష్యత్తులో ‘పెద్ద పోస్టు’ లభించే అవకాశం ఉందని పవార్‌కు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం మాతో చేతులు కలపమని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.
2019లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 105 సీట్లు గెలుచుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 288 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో శివసేన 56 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత బీజేపీతో విభేదాలు రావడంతో శివసేన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే.
టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో.. పవన్ పై మంత్రి వెల్లంపల్లి ఫైర్